Haryana: హర్యానాలో దారుణం జరిగింది. గోవుల స్మగ్లర్లుగా భావించి, గో సంరక్షకులు కారును వెంబడించి హత్య చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 23న జరిగిన ఈ దాడిలో నిందితులను నిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్ మరియు సౌరభ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.