Harish Rao: కేటీఆర్‌కి సిట్ నోటీసులపై హరీష్‌రావు ఫైర్ అయ్యారు. నోటీసులు నేపథ్యంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు ఇస్తే రేవంత్ ప్రజల ఖాతా నుంచి తీసుకుంటా అంటున్నారని ఆరోపించారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రీతిలో దిగి వస్తూ శాసనసభ నిబంధనలు లేకుండా సభను నడుపుతున్నారని ఆరోపించారు. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.