‘కేజీఎఫ్’ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, వ్యాధి తీవ్రత పెరగడంతో చివరికి ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రాయ్ మృత్యువుతో కన్నడ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. యశ్, శ్రీమురళి, రమేశ్ అరవింద్ వంటి పలువురు నటులు సోషల్ మీడియాలో ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఒక నిజమైన పోరాట యోధుడిని కోల్పోయాం” అంటూ అభిమానులు స్మరించారు.…