KGF Chacha: కేజీఎఫ్ నటుడు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేజీఎఫ్’ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, వ్యాధి తీవ్రత పెరగడంతో చివరికి ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రాయ్ మృత్యువుతో కన్నడ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. యశ్, శ్రీమురళి, రమేశ్ అరవింద్ వంటి పలువురు నటులు సోషల్ మీడియాలో ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఒక నిజమైన పోరాట యోధుడిని కోల్పోయాం” అంటూ అభిమానులు స్మరించారు. తన చిరునవ్వుతో, సహజమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హరీశ్ రాయ్ ఇకలేరన్న వార్త సినీప్రియులను కన్నీరు పెట్టిస్తోంది.
Also Read : Keerthy Suresh : పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన కీర్తి – కొత్త యాక్షన్ చిత్రం ప్రకటించిన బ్యూటీ
Also Read
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆయన వయసు 53 సంవత్సరాలు. గతంలో ఓ ఇంటర్వ్యూలో హరీశ్ రాయ్ తన అనారోగ్య పరిస్థితి గురించి హృదయవిదారకంగా వెల్లడించారు. “నేను క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. ‘కేజీఎఫ్’లో నా లుక్ వెనుక కూడా అదే కారణం ఉంది. నా గొంతు క్యాన్సర్ వల్ల వాచిపోయింది. ఆ వాచిన ప్రాంతం కనపడకుండా ఉండేందుకు నేను గడ్డం పెంచుకున్నాను” అని చెప్పారు. ఆ సమయంలో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, ముఖ్యంగా యశ్ సహా కొందరు హీరోలు ఆర్థిక సాయం చేసినట్లు తెలిసింది. ఇక హరీశ్ రాయ్ 1995లో వచ్చిన ‘ఓం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో డాన్ రాయ్ పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పలు కన్నడ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కానీ ఆయన కెరీర్‌లో నిజమైన మలుపు తెచ్చింది ‘కేజీఎఫ్’ సినిమా. ఆ సినిమాలో ఆయన చేసిన ఖాసిం చాచా పాత్ర ప్రేక్షకుల మదిలో ముద్ర వేసింది. యశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని సాధించగా, హరీశ్ పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!