అక్కడ ఎమ్మెల్యేకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ చూపిస్తోంది కూడా సొంత కేడరే కావడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదట. పార్టీ అధిష్టానం దగ్గర పరువు పోతోందిరా.. ప్లీజ్… ఈసారికి కో ఆపరేట్ చేయండర్రా… అని బతిమాలుకుంటున్నా… డోంట్ కేర్,… ఇన్నాళ్ళు ఈ బుద్ధి ఏ గాడిదలు కాసిందని ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నారట. అంతలా ఇరకాటంలో పడ్డ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటాయన బతిమూలుడు, బామాలుడు యవ్వారం? కొమురం భీం జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం…