టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందే ఊహించని సమస్యల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన హార్డ్ డ్రైవ్ మాయమైన వ్యవహారం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్‌లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి పంపిన హార్డ్ డ్రైవ్ ఆఫీస్ బాయ్ రఘు ద్వారా చరిత అనే యువతికి అప్పగించబడింది. అయితే, ఆ తర్వాత చరిత కనిపించకుండా పోయింది. 24…