తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిన్న ధృవాలుగా వున్నారనే ప్రచారం వుంది. తాజాగా వీళ్ళిద్దరూ ఐక్యతారాగం వినిపించారు. కలిసి కనిపించారు. తెలంగాణలో పీసీసీ పీఠం కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. ఒకరికి పదవి దక్కగానే.. మరొకరు ఒంటికాలిపై లేచారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సమన్వయం లేదు. కానీ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తారు. మనసులు కలిశాయా.. మనుషులు కలిశారా అని అనుకుంటున్న తరుణంలోనే చర్చల్లోకి వస్తారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పడుతున్న…