(అక్టోబర్ 9న ఎస్పీ శైలజ పుట్టినరోజు)ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు.…