Prasanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. అ! అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆ తరువాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తెరకెక్కించాడు.