‘ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ లవ్ స్టోరీగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వీడియో గ్లిమ్స్‌ని…