స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తాజాగా తెలుగులో ‘సీతారామం’ చిత్రంలో రెండు పాటలు పాడాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇందులోని ‘ఓహ్ సీతా…’, ‘ఇంతందం’ గీతాలు ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచాయి. వీటిని పాడింది ఎస్పీ చరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”నేను…