'Hands Off' Protest: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతడి మద్దతుదారు బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి వ్యతిరేకంగా యూఎస్ వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతోంది. ‘‘హ్యాండ్స్ ఆఫ్’’ నిరసన ప్రదర్శనలతో ఆందోళనకారులు హోరెత్తిస్తున్నారు. ట్రంప్ పరిపాలన విధానాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా ‘‘పరస్పర పన్నుల’’ విధించడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఉద్యోగాల కోతపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.