Lagacherla : రైతు ఈర్యా నాయక్‌కి బేడీల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారమిచ్చినట్లు విచారణ తేలింది. జైలు రికార్డులో ఈర్యా నాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్ లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్టు జైలు సిబ్బంది పేర్కొన్నారు. దీని వెనుక కూడా రాజకీయ కుట్ర…