వరైనా నేరం చేస్తే వాళ్లను బొక్కలో తోస్తారు. అంటే జైలులో వేస్తారు. ఎందుకు అంటే.. అక్కడే కొన్నేళ్ల పాటు వాళ్లను ఉంచి.. వాళ్లకు కష్టాలు పెట్టి వాళ్లలో మార్పును తీసుకురావడానికి. అందుకే జైలులో అన్ని సౌకర్యాలు ఉండవు. ఎక్కడైనా అవే రూల్స్ ఉంటాయి. పైగా నిద్రపట్టకుండా చేసే దోమలు, దుర్గంధం వెదజల్లే గదులు గుర్తొచ్చి ఒక దుర్భర జీవితాన్ని ఊహించుకుంటాం. కానీ నార్వేలోని హాల్డెన్ జైలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జైలుగా పేరొందింది.