రానున్న మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్‌లో మే 3 వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.