ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలందరూ ఏకమై.. వైసీపీని గెలిపించి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి అని పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లాలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగించినట్టే కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్‌లోను సత్తా చాటింది. మున్సిపల్ కార్పొరేషన్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, మేయర్, 52 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. అంతమంది ఉన్నారు కదా.. పార్టీ బలంగా ఉంటుందని భావించిన కేడర్‌కు చుక్కలు కనిపిస్తున్నాయట. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు స్తంభాలాట సాగుతోంది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే…