భారతీయులకు హెచ్-1బీ వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. హెచ్1-బీ వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టాక భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సోషల్ మీడియా నిబంధనలు కొత్త తలనొప్పి తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్-1బీ వీసాల అపాయింట్‌మెంట్‌లు వాయిదా పడ్డాయి.