H-1B Visas: మంచి వేతనాలను తీసుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికే హెచ్-1బీ వీసా ఉపయోగపడుతోందని యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపణలు చేశారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకునే ప్రమాదం ఉందని ఆక్షేపించారు.