Gyanvapi Case : వారణాసిలోని జ్ఞాన్‌వాపి వ్యాస్జీ బేస్‌మెంట్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. జ్ఞానవాపిలో పూజను కొనసాగించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కొత్తది కాదు. చాలా కాలంగా నడుస్తున్నదే. ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవాలి. 1991లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టం చేశారు. 1991లో అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్యమం సాగుతున్న సమయంలో అంటే, అద్వానీ రథయాత్ర, యూపీలాంటిచోట్ల మతరపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న రోజుల్లో, 1991 సెప్టెంబర్ 18న నాటి పివి…
వారణాసి లోని కాశీ విశ్వనాధ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం ముగిశాయి. వారణాసి జిల్లా కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. అనుభవజ్ఞులైన న్యాయమూర్తి దీనిని విచారించాలని ఆదేశించింది. సివిల్ వివాదంలోని అత్యంత సున్నితమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, కేసును సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. సీసీపీ నిబంధన 11లోని 7…
కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 22 గదులు తెరవాలంటూ కోర్టు ఆశ్రయించారు. అయితే తాజాగా జ్ఞాన్‌వాపి మసీదులో బయట పడ్డ శివలింగంపై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని సంఘ్ పరివార్ యోచిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్‌వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్ పరివార్ ద్వేషపూరిత…
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు అంశం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ ఉత్తర్వుల మేరకు మే 14-16 వరకు మసీదులో వీడియో సర్వే నిర్వహించి మే 17న రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ నియమించిన కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ రోజే వీడియోగ్రఫీ సర్వే వివరాలను కోర్ట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే జ్ఞానవాపీ మసీదులోని వజూ ఖానాలోని బావిలో శివలింగ భయటపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీడియో సర్వేకు మరింత సమయం కావాలని కోర్ట్ కమిషనర్లు వారణాసి…