జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… పది స్థానాల్లోనూ వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు.. అయితే, టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది.. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఈ ఎన్నికల్లో 98 డివిజన్లకు గాను 93 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. మొత్తంగా పదికి పది స్థానాలను వైసీపీ కైవసం…