IND vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాకు భారీ టార్గెట్ ను ముందు ఉంచింది. భారత్ భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ విజయం దిశగా పయనం చాలా దూరంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో టీమిండియాకు వైట్‌వాష్ భయం వెంటాడుతోంది. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్‌ను చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ముత్తుస్వామి (109), జాన్సెన్ (93),…