నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం కుమ్మరోనీ పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి జరిగింది. అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారంలో ఉండగా మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్లతో దాడి చేశాడు.
గువ్వల బాలరాజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన వారి గురించి బయటపెట్టారు. తెలంగాణలో ఎన్నడూ లేని ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు.. నిన్న నామీద దాడిచేశారన్నారు. నిన్న ప్రచారం ముగించుకొని వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన కాన్వాయ్ ని వెంబడిస్తూ అచ్చంపేట రాగానే ఆపి తన మీద దాడికి దిగారని తెలిపారు.…
Nagarkurnool:కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఇది రాజకీయ దుమారానికి తెరతీసింది.. అదేస్థాయిలో కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. అయితే, ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా రాహుల్ గాంధీ వీడియో వైరల్ అవుతోంది.. పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్ముంటే, మొనగాడు అయితే రాహుల్ గాంధీతో డ్రగ్స్ టెస్ట్ కోసం వెంట్రుకలు ఇప్పించాలని… వరంగల్…
నోటి దురుసు ఆ ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. కాంట్రవర్శీ కామెంట్స్ ఆయనకు శాపమై.. చిరాకు పెడుతున్నాయి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు.. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపుతో.. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేను రాజీనామా చేయాలంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యే ప్రస్టేషన్.. పీక్ కు వెళ్లినట్లు తెలుస్తోంది . ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ? ఆయన తిప్పలేంటో చూద్దాం… అచ్చంపేట ఎమ్మెల్యే , విప్ గువ్వల బాలరాజు వ్యవహార శైలి…
ఈమధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా వున్నారంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తప్ప మరెవరూ కాదనే చెప్పాలి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవరని, ఆయన గెలిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈటల గెలవడంతో బాలరాజు పరిస్థితి ఘోరంగా మారింది. అన్నా ఎప్పుడు రాజీనామా చేస్తావంటూ బీజేపీ, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బాలరాజుపై వత్తిడి తేవడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.…
హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సెగ ఇప్పుడు అధికార పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును తాకింది.. దానికి ప్రధాన కారణం.. హుజూరాబాద్ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ డిబేట్‌లో ఆయన సవాల్ చేయడమే.. అయితే, కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన ఓట్లు రావాలి.. ఈటల గెలవాలి.. అలా జరిగితే తాను రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు గువ్వల.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం వెలువడం.. ఈటల…