పేపర్ లీకేజ్ పదివేల కోట్ల స్కామ్ ఎట్లా అవుతుంది? పేపర్ లీకేజీ దాగే విషయం కాదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాకు పంచాంగం మీద నమ్మకం లేదని, నేను ఎప్పుడు జాతకం చెప్పించుకోలేదని అన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే కుటుంబ పాలనా..? అది కనిపించడం లేదా అంటూ తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని. రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరమని విమర్శించారు. read also: Telangana Congress: మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఆ పార్టీకి సవాల్ గా…
యాసంగి ధాన్నాన్ని నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోళు చేయనుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పండిన ధాన్యం కేంద్రం కొనాల్సి ఉన్నా కొనకపోవడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పండిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారని ఆయన…
మంత్రి కావాలన్న ఆ సీనియర్ నేత కల కలేనా? ఇప్పట్లో ఆ యోగం లేనట్టేనా? రెండోసారి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న ఆయనకు పాత పదవే మళ్లీ కట్టబెడతారా? దానికి ఆ సీనియర్ ఒప్పుకొంటారా? గుత్తాకు ఇచ్చే కొత్త పదవిపై చర్చ..! తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీఆర్ఎస్‌కు వచ్చారు. గులాబీ కండువా కప్పుకొన్న సమయంలో గుత్తాను మంత్రివర్గంలోకి…
దాదాపు 3 దశాబ్దాలుగా ఆ డెయిరీలో ఆ సీనియర్ నేత చెప్పిందే వేదం.. శాసనం..! పెత్తనమంతా ఆయన ఫ్యామిలీదే…! పార్టీలు మారినా.. డెయిరీలో పట్టు సడలకుండా చూసుకున్నారు ఆ నాయకుడు. కానీ.. జిల్లా రాజకీయాల్లో వచ్చిన ఆధిపత్యపోరు.. సీటుకే ఎసరు పెట్టింది. ఇక ఆయన శకం ముగిసినట్టేనని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరాయన? ఏమా కథ? మదర్ డెయిరీతో గుత్తా బంధం తెగినట్టేనా? నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మదర్ డెయిరీ కూడా కీలకం. 30 ఏళ్లుగా డెయిరీపై గుత్తా…
ఆ కోటాలో ఎమ్మెల్సీ అవుతామని అధికారపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుడు తన్నుకుపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే కోటాలో అయినా ఛాన్స్ ఉంటుందా? సొంత జిల్లా నుంచి ఆయనకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఎవరాయన? లెట్స్ వాచ్! ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యేది ఎవరో? తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేసింది అధికార పార్టీ. ఇటీవల కాంగ్రెస్ నుంచి…