నల్గొండ జిల్లా:-తెలంగాణ పీసీసీ నియామకంపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీగా ఉన్న ఉత్తమ్ కుమార్ పోయి… ఉత్తర కుమారుడు వచ్చిండని… ఎవరు వచ్చినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదని సెటైర్ వేశారు. వచ్చే రెండేళ్లు.. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించడానికే సరిపోదని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని… సమైక్య ఆంధ్ర నుంచే తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. పోతిరెడ్డిపాడు…
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్‌చాట్‌లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం…
అధినేత దృష్టిలో పడేందుకు కొత్త ఎత్తుగడ వేశారా? రాజ్యాంగ పదవిలో ఉన్నా.. విపక్ష పార్టీపై విమర్శలకు కారణం కూడా అందుకేనా? కల సాకారం చేసుకోవడానికి.. ఎక్స్‌టెన్షన్ పొందడానికి ఆయన ఎంచుకున్న మార్గం వర్కవుట్ అవుతుందా? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఏమా కథ? త్వరలో ముగియనున్న గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం! గుత్తా సుఖేందర్‌రెడ్డి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎంపీగా పనిచేశారు గుత్తా. మంత్రి కావాలన్నది ఆయన చిరకాల…