హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కార్ల వర్క్‌షాప్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 16 లగ్జరీ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.7 కోట్లు విలువైన కార్లు బూడిదయ్యాయని సమాచారం.