టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్ హిందీ చిత్రం ‘రామ్ సేతు’లో కీలక పాత్ర పోషిస్తున్న సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ జనవరి మాసంలో రిపబ్లిక్ డే కానుకగా రాబోతోంది. అలానే మరో చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగశేఖర్ ‘గుర్తుందా శీతాకాలం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు ఇది రీమేక్.…