Womens Protest: గుంటూరు ఎస్పీ కార్యాలయం ముందు మహిళల ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు తమపై దాడి చేసి ఇబ్బంది పెట్టారంటూ కోటేశ్వరమ్మ అనే మహిళ ఆమె కూతురుతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమపై దాడి జరిగిందని మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, సీఐ దురుసుగా వ్యవహరిస్తున్నారు అని బాధిత మహిళలు పేర్కొంటున్నారు.