గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నెల రోజుల క్రితం ఐతానగర్‌లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడిచేశారు రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబూలాల్, రాకేష్.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు తెనాలి టూ టౌన్ పోలీసులు. నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. అయితే, విచారణలో షాకింగ్ విషాలు వెలుగు చూశాయి.. డబ్బులు అప్పు తీసుకుని, అడిగితే ఆ మహిళల ముఠా హత్యలు చేస్తున్నట్టు గుర్తించారు..
అనకాపల్లిలోని పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలోని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి బండారు ఇంటి దగ్గర పోలీసు యాక్షన్ మొదలైంది. బండారు ఇంట్లోకి పోలీసులు చొచ్చుకుపోయారు. ఆయనను తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
ఏపీలో ఛలో కంతేరు నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యకర్త వెంకాయమ్మ కుటుంబంపై దాడి ఘటనను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. దాడిపై పోలీసులుస్పందించలేదంటూ ఛలో కంతేరుకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీపీ కీలక నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీమంత్రి నక్కా ఆనందబాబులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు మాజీ…