విజయవాడ నగరంలో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే గుణదల మేరీమాత ఉత్సవాలపై ఈ ఏడాది కరోనా ప్రభావం కనిపిస్తోంది. లక్షలాది మంది హాజరయ్యే గుణదల మేరీ మాత ఉత్సవాలను కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న సందర్భంగా లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం కష్టసాధ్యమని, భక్తులు ఇబ్బందికి గురికాకూడదని నిర్వాహకులు యోచిస్తున్నారు. అందుకే ఉత్సవాలను రద్దు చేయాలని…