ఆ జిల్లాలో జరిగిన పల్లెపోరులో టీడీపీ సాధించుకున్న పంచాయతీల కంటే.. మంత్రి ఇలాకాలో సైకిల్ పాగా వేసిన స్థానాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎక్కడ తేడా కొట్టిందో అధికారపార్టీ వర్గాలకు అంతు చిక్కడం లేదట. అసలే కష్టకాలంలో ఉన్న అమాత్యునికి ఇప్పుడీ షాక్ ఏంటని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి జయరాం నియోజకవర్గంలో టీడీపీ పాగా! అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్ వన్‌సైడ్ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి…