కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ పార్టీ దేశంలోని మరో రాష్ట్రంపై కన్నేసింది. ఆప్ ఖాతాలో ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో రాష్ట్రాన్ని కూడా చేజిక్కించుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్నారు. గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రానిల్ రాజ్‌గురు హస్తం పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీని గద్దె దించే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
దీంతో ఇంద్రానిల్ రాజ్‌గురు ఆమ్‌ఆద్మీ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్‌లో బీజేపీని ఓడించే సత్తా కేవలం ఆప్‌కు మాత్రమే ఉందని రాజ్‌గురు స్పష్టం చేశారు. ఆప్‌లో నాయకులకు కేజ్రీవాల్ ఇచ్చే గౌరవం, ప్రాముఖ్యత తనను ఆకట్టుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… సంపన్న కుటుంబానికి చెందిన కీలక నేత దూరం కావడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు వారాల క్రితమే గుజరాత్ పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఇంద్రానిల్ రాజ్‌గురు నియమితులయ్యారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన పార్టీ మారడం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Pakistan Zindabad: యూపీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’.. వైరల్‌గా మారిన వీడియో