గుజరాత్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక సూరత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి.
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం కూలిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం కూలిపోయినట్లుగా తెలుస్తోంది. సంఘటనాస్థలికి 12 ఫైరింజన్లు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఇక విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఎయిర్‌పోర్టులో భారీగా పొగలు కమ్ముకున్నాయి.
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్‌లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే దాయాది దేశం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పినట్లు ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. గాంధీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే రోటీ తినండి.. లేకుంటే బుల్లెట్ ఉందని పాకిస్థాన్‌ను ప్రధాని మోడీ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సోమవారం గుజరాత్‌లో పర్యటించారు.
మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిపెట్టిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మరొకసారి పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సిందూర్ అనేది వివాహానికి సంకేతమని.. దానిని తుడిచివేయడం అంటే వైధవ్యాన్ని సూచిస్తుందన్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆయన రూ.77 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఐదు నగరాల్లో నాలుగు రోడ్ షోలు, మూడు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. దీనితో పాటు, ‘మేక్ ఇన్ ఇండియా’ కింద, దాహోద్‌లో రూ. 21 వేల కోట్లకు పైగా వ్యయంతో ఏర్పాటు చేసిన రైల్వే ఉత్పత్తి యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. Also Read:HPSL…
Bypolls 2025: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. తాజాగా, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
PM Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించబోతున్నారు. మే 26, 27 తేదీల్లో ఆయన గాంధీనగర్, కచ్, దాహోద్ సహా మూడు జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోడీ భుజ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ఈ సభకు లక్ష మంది వరకు హాజరవుతారని తెలుస్తోంది. బహిరంగ సభ తర్వాత మోడీ ఆశాపుర ఆలయాన్ని సందర్శిస్తారు. Read Also: Theatres Closure :…