ప్రధాని మోడీ సొంత గ్రామం గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో అరుదైన నాణేలు లభ్యమయ్యాయి. దశాబ్ద కాలంగా పురావస్తు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఇండో-గ్రీకుకు చెందిన నాణేల అచ్చులు లభ్యమయ్యాయి. శతాబ్దాల తర్వాత నాణేల ఉత్పత్తులు లభించాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)లో సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ అభిజిత్ అంబేకర్ అన్నారు.
ఇది కూడా చదవండి: Shobha Karandlaje: కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి.. కేంద్రమంత్రి ఫైర్
ప్రధానమంత్రి మోడీ స్వగ్రామమైన వాద్‌నగర్‌లో 2014 నుంచి 2024 వరకు దశాబ్దం పాటు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో 37 టెర్రకోట నాణేల అచ్చులను కనుగొన్నారు. ఈ అచ్చులు స్థానికంగా సంబంధించినవి కావు. ఈ అచ్చులు ఇండో-గ్రీకు చక్రవర్తి అపోలోడోటస్-2కు చెందిన నాణేలుగా గుర్తించారు. ఈ అచ్చులు డై-స్ట్రక్డ్ ఒరిజినల్ అచ్చుల మాదిరిగా కాకుండా.. కాస్టింగ్ పద్ధతిలో ఉన్నాయి. బహుశా ఈ అచ్చులు అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్ర మార్గాల్లో డ్రాచ్మా వాణిజ్య మార్గాల ద్వారా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఈ అచ్చులు 5-10 శతాబ్దాల నాటి అచ్చులుగా సూచిస్తు్నట్లుగా ఆర్కియాలజిస్ట్ డాక్టర్ అభిజిత్ అంబేకర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ఏవేవో ఆలోచనలు.. కాళ్లు, చేతులు ఆడలేదు!
ఆ రోజుల్లో కీలక వాణిజ్య కేంద్రం గుజరాత్ నుంచే ఇండో-గ్రీకు నాణేలు ఉత్పత్తి జరిగినట్లుగా సమాచారం. భరూచ్ ఒక ప్రధాన ఓడరేవుగా వాద్‌నగర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషినట్లుగా అంబేకర్ పేర్కొన్నారు.
శనివారం ముగిసిన ఆస్ట్రేలియాలోని డార్విన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ పురావస్తు కాంగ్రెస్ పదవ ఎడిషన్‌లో వాద్‌నగర్‌కు సంబంధించిన నాలుగు అధ్యయనాల్లో గ్రీకు నాణేలు ఒకటి కావడం విశేషం. అధ్యయనాలకు ఉత్తర గుజరాత్ పట్టణం కేంద్రం కావడం విశేషం. ప్రపంచంలోనే ఇతర ప్రాంతాలను గుజరాత్‌తోనే అనుసంధానించడినట్లుగా సమాచారం. అందుకే ఆనాటి కాలానికి సంబంధించిన కీలక ఆధారాలను పురావస్తు శాఖ గుర్తించగలిగింది.