ఏపీలో టీడీపీ మాటెత్తితే అంతెత్తున లేస్తారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని). చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీ నేతల్ని ఉతికి ఆరేస్తుంటారు. అలాంటిది ఈసారి నానిగారి టార్గెట్ మారింది. బీజేపీ నేతలపై ఆయనన విమర్శలు చేస్తున్నారు. గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందని, అయితే వాటిని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అడ్డుకుంటున్నారంటూ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో పురందేశ్వరి జాతీయ ప్రధాన…