ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో జీ 20 సదస్సు జరిగే బ్రెజిల్‌తో పాటు భాగంగా నైజీరియా, గ్వామ్ దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. అయితే తాజాగా సోమవారం తెల్లవారు జామున ప్రధాని బ్రెజిల్‌కు చేరుకున్నారు. నేడు రియో డీజెనిరోలో జరిగే జీ-20 సదస్సులో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశం కానున్నారు.