తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లో కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మించిన సినిమా ‘జీఎస్టీ’ (గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ బాగుందని, అలానే సినిమా కాన్సెప్ట్ ను దర్శకుడు తనకు చెప్పారని, అది కూడా ఆసక్తికరంగా ఉందని, ఈ సినిమా ద్వారా చక్కని సందేశాన్ని కూడా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని అన్నారు.…