దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జీఎస్టీ ద్వారా వచ్చే స్థూల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి అక్టోబర్ 2022లో రూ.1,51,718 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.