GST: చక్కెర రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. మెలాసిస్‌పై పన్నులను 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య వల్ల చెరుకు రైతులకు మేలు జరుగుతుంది. పశువుల దాణా ధర కూడా తగ్గుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మనుషులు వినియోగించే మద్యాన్ని కూడా లెవీ నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.