వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేస్తున్నారు. చెట్లని కొట్టేస్తే పెంచొచ్చు.. కొండల్ని తవ్వేస్తే ఎలా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. విశాఖలోని రుషికొండను ఇష్టం వచ్చినట్లు తవ్వేశారని.. విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండను ధ్వంసం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. రుషికొండను తవ్వొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి కూడా అంతుబట్టని విధంగా రవ్వల కొండను తవ్వేశారని ఆవేదన…