యాపిల్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్‌గా పేరుగాంచిన పండు. రోజూ ఒక యాపిల్ తింటే వంద రోగాల నుంచి దూరం అవుతుందంటారు. అయితే యాపిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయని మీకు తెలుసా..? దాని రంగులను బట్టి పోషకాలు కూడా మారుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7500 రకాల ఆపిల్‌లు ఉన్నాయి.
Benefits Of Eating Green Apples: ‘ఆపిల్’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యాపిల్‌ను ‘ఆరోగ్య నిధి’ అని కూడా అంటారు. యాపిల్స్ పలు రంగులలో ఉంటాయి. సాధారణంగా ఎరుపు మరియు పసుపు ఆపిల్‌లను ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే గ్రీన్ ఆపిల్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయడంతో…