Artificial intelligence (AI): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రస్తుతం ప్రపంచదేశాలు దృష్టి సారించాయి. అయితే కొంతమంది టెక్ దిగ్గజాలు ఏఐతో రాబోయ కాలంలో విధ్వంసం తప్పదని హెచ్చరిస్తుండగా.. మరికొందరు మానవుల జీవనాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఇటీవల డీఫ్‌ఫేక్ వీడియోలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రెటీల మార్ఫుడ్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఏఐని దుర్వినియోగం చేయడంపై ఏకంగా ప్రధాన మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు.