చైనా, పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టిన మాజీ సైనికుడిని కొట్టి చంపాడు. 93 ఏళ్ల వృద్ధుడు తన మనవడికి పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన మనవడు తాతను కర్రతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.