అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్ వ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారన్న ఆయన.. వైసీపీ పార్టీ నాయకులు చెప్పిన వారిని వాలంటీర్లుగా నియమించామని తెలిపారు. ఇక, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే దానికి ముఖ్య కారకులు వాలంటీర్లే అన్నారు బాలినేని.. అంతేకాదు.. గడప గడపకే నేను తిరుగుతాను.. కానీ, నన్ను…
తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో గ్రామ సచివాలయం వాలంటీర్లుకు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇన్సూరెన్స్ చేయించారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ పత్రాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ చేతులు మీదుగా వాలంటీర్లుకు అందజేశారు. జిల్లాలో అభివృద్ధి పథంలో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 90 శాతం పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను జిల్లా కలెక్టర్ హరికిరణ్ అభినందించారు. అంతేకాకుండా రాజానగరం…
ఏపీలో జగన్ ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వుంది. ఈ నేపథ్యంలో ఆదాయం సమకూర్చుకునేందుకు దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన ఇళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో వడి వడిగా అడుగులేస్తోంది ప్రభుత్వం. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం కింద రిజిస్ట్రేషన్లు చేసే అధికారాలను గ్రామ, వార్డు సెక్రటరీలకు దఖలు పరిచింది జగన్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆదాయంపై కన్నేసింది. ఈ పథకం ద్వారా ఖజానా నిండుతుందని ఆర్థిక…