ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి వాలంటీర్లకు అధికారులు అవార్డుల సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. కనీసం సంవత్సర కాలంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు మూడు కేటగిరీల్లో పురస్కారాలు అందజేయనున్నారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర క్యాటగిరిల్లో వాలంటీర్లకు అవార్డులను ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మంది వాలంటీర్లకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. వాలంటీర్లకు పురస్కారాల కోసం రూ.258.74 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. …