అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి స్టార్ డమ్ ఏర్పర్చుకుంది. సమంత ఊ అనాలేగానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం ఒకప్పటిలా సినిమాలు చేయట్లేదు..? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా. కావాలనే సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఆమె ఇటీవల ‘సిటాడెల్:హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది.…