రాష్ట్ర విభజన సరిగా సాగకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని శాఖల మధ్య వివాదాలు రాజుకుంటూనే వున్నాయి. తాజాగా విద్యుత్ రంగంలో జీపీఎఫ్ వివాదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. 1999 నుంచి 2014 వరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము రూ. 2900 కోట్లు వుందన్నారు. ఇటీవల ఏపీలోని…