గౌడ కార్మికులు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడే విధంగా ప్రభుత్వ విప్ , స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో కొత్త గ్రంథాలయ భవనంలో కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గీత కార్మికులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గీత కార్మికులకు అవసరమైన సహాయం…