బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. ముంబై జుహాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ జాతీయ మీడియాతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 61 ఏళ్ల గోవిందా మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, వెంటనే కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆయనను ఆస్పత్రిలో చేర్చగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. Also Read…