తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఎపిసోడ్ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశం రచ్చరేపుతుంటే.. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. యాదగిరిగుట్టలో ఆలయం ప్రారంభానికి తనను పిలవలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. అయితే, ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో మా ఇష్టం అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దీనికి తోడు తరచుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు గవర్నర్ విందుకి ఆహ్వానిస్తే టీఆర్ఎస్ మంత్రులు ఎవరూ వెళ్లకపోవడంపై…