మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఇక, ఏక్‌నాథ్ షిండే అక్కడున్న స్క్రిప్ట్‌ను చదవకుండా సొంతంగా ప్రసంగించారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. జనవరి 31న అప్పటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.
తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేటి ఉదయం ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఇప్పటికీ పెండింగులోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు.. ఈ కార్యక్రమంలో తమిళనాడు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ గీతాలక్ష్మి, కొండాలక్ష్మణ్ యునివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను నల్లగొండ జిల్లాలోని గాంధీ గుడి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ ను గాంధీ గుడి సభ్యులు శాలువాతో సత్కరించారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకున్న చర్యలను గవర్నర్‌కు గాంధీ గుడి సభ్యులు వివరించారు. అంతేకాకుండా.. మద్యపాన నిషేధ ప్రచారాన్ని చేయాలని గాంధీ గుడి సభ్యులకు గవర్నర్ సూచించారు. డబ్బు పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే తాను ఓ ఎన్నికల్లో ఓడిపోయానని…